నెల్లూరు, జనవరి 30, మన ధ్యాస, (నాగరాజు కె).

గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆండ్ర బాల గురవారెడ్డి ప్రస్తుతం నెల్లూరు నగరంలోని వీకే హాస్పిటల్‌ నందు చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాస్పిటల్‌కు వెళ్లి బాల గురవారెడ్డి ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని, చికిత్సపై సంతృప్తి వ్యక్తం చేసి, బాలగురవారెడ్డి కి ధైర్యం చెప్పి, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే ఈ కష్టకాలంలో తాను మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయం ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు. బాల గురవారెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *