ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..యువత దేశాభివృద్ధికి బాధ్యతగా ముందుకు రావాలని పిలుపు.

వింజమూరు జనవరి 26, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె).

వింజమూరు మండల కేంద్రంలోని నేతాజీ వికాస్ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించి ఎగురవేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడంలో ఎందరో మహనీయులైన స్వాతంత్ర సమరయోధులు తమ ధన, మాన, ప్రాణము అన్నీ త్యాగం చేసి చేసిన అపూర్వ పోరాటాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు. వారి అశేష త్యాగాల వల్లనే భారతదేశం ఒక సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ప్రపంచంలో గర్వంగా నిలిచిందని అన్నారు.గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా, భారత రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే రోజు అని, ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. యువత చదువు, క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగితేనే దేశ భవిష్యత్ మరింత ప్రకాశవంతంగా మారుతుందని పిలుపునిచ్చారు.ఈ వేడుకలను విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *