తండ్రికి తగ్గ తనయుడు మంత్రి నారా లోకేష్ బాబు..ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ..
సీతారాంపురం, మన న్యూస్, జనవరి 23,(నాగరాజు కె ).

తండ్రికి తగ్గ తనయుడు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కొనియాడారు. శుక్రవారం సీతారామపురం నాలుగు రోడ్ల కూడలి లోని హనుమాన్ జంక్షన్ లో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల శీను ఆధ్వర్యంలో యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విచ్చేసి 43 కిలోల భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ తండ్రికి తోడుగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో అందర్నీ కలుపుకొని ముందుకు పోతున్న యువ నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. తండ్రి చనిపోయాడని తెలిసి ముఖ్యమంత్రి పీఠం కోసం పాకులాడిన జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర ప్రజలు చూశారని, తండ్రి జైల్లో ఉన్నప్పుడు అహర్నిశలు ప్రజల్లో ఉంటూ తండ్రి కన్నీళ్లు తుడిచిన నాయకుడైన లోకేష్ బాబును రాష్ట్ర ప్రజలు చూశారని తెలిపారు. తండ్రి వారసత్వ నియోజకవర్గం తీసుకోకుండా ఓడిన చోటే గెలవాలని మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 90 వేల పై చిలుకు ఓట్లతో గెలిచిన గొప్ప నాయకుడు లోకేష్ అని తెలిపారు. విదేశాల్లో స్థిరపడ్డ మాలాంటి యువ పారిశ్రామికవేత్తలను రాజకీయాల్లోకి ప్రోత్సహించి, మమ్మల్ని ముందుండి నడిపించిన వ్యక్తి నారా లోకేష్ అని తెలిపారు. రాష్ట్రంలోని యువత అన్నా అని పిలిస్తే అన్నివేళలా లోకేష్ వారి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తూ మాలాంటి నాయకులందరికీ ఒక పెద్దన్నగా ఉంటున్నటువంటి విద్య, ఐ.టీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరపడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా శాఖలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి విద్యార్థులకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక కొత్త ఒరవడిని తీసుకురావడం జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా డీఎస్సీ ఏర్పాటు చేసి 16,000 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు.తండ్రి బాటలో పయనిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పెద్దన్నగా లోకేష్ అన్న ఉన్నారని తెలిపారు.మా నాయకుడు లోకేష్ బాబు కి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
