మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి పూజ రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఇళ్ల వద్ద ముగ్గు వేసి భూమి పూజ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని నాయకులు తెలిపారు. బిచ్కుంద మండలంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *