మన ద్యాస,నెల్లూరు, జనవరి 20 : నెల్లూరు సిటీ 50వ డివిజన్, మెట్ల రేవు ప్రాంతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం డ్రైనేజీ పనులకు తవ్వి ఇప్పటికీ రోడ్ వేయకపోవటం వల్ల, గుంతలు కాల్వలు నిర్మాణం లేక మట్టి, సన్ను పేరుకుపోయి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువల్లో సరైన ప్రవాహం లేక దుర్గంధం, దోమల బెడదతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక నిత్యజీవితం దుర్భరంగా మారిందని తెలిపారు.ఈ సమస్యలను స్థానికులు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడంతో, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..“మీరు మాకు ఓట్లు వేశారా లేదా అనే ప్రశ్న లేకుండా, ఎలాంటి కారణాల వల్ల కూడా ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయడం జరగదు. ఎమ్మెల్యే పొంగూరు నారాయణ కొన్ని వర్గాలకే పరిమితం కాని ఎమ్మెల్యే కాదు. నెల్లూరు సిటీ మొత్తాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అన్నీ సమానంగా అన్ని ప్రాంతాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు” అని స్పష్టం చేశారు.ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్డు, కాలువల పారుదల సమస్యలను సంబంధిత పరిపాలనా శాఖల దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గం ద్వారా త్వరితగతిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని గునుకుల కిషోర్ హామీ ఇచ్చారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే పొంగూరు నారాయణ దృష్టికి కూడా వెంటనే తీసుకెళ్తామని తెలిపారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అయిన “ప్రజల దగ్గరకు పాలన – సమస్యల దగ్గరకు నాయకత్వం” అనే భావనకు అనుగుణంగా, జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు. జనసేన సిద్ధాంతాలే తమ మార్గదర్శకాలని, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌తో పాటుసంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,జనసేన నాయకులు అశోక్, వేముల శివ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *