మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు.అనంతరం ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌కు చేరుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *