మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామరెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.నూతన సంవత్సరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజాదర్బార్ దినపత్రిక గత 31 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మల్లప్ప పటేల్,తదితరులు ఉన్నారు.
