చిత్తూరు, మనధ్యాస, జనవరి 17
దళితుంటే బాబుకు చిన్నచూపుగా మారిందని వైఎస్సార్‌సీపీ నాయకులు దుయ్యబట్టారు.శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్యను ఖండించారు.ఈసందర్భంగా ఆపార్టీ మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, గుడిపాల మండలాధ్యక్షుడు ప్రకాష్‌లు మాట్లాడారు.టీడీపీ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతు సాల్మన్ మరణించాడన్నారు.ఈ ఘటనలో మృతుడి పై కేసు నమోదు చేయడం సంచలనంగా మారిందన్నారు. అధికారపార్టీ నాయకుల దాడులకు బెదిరి పక్క ఊరిలో కుటుంబం తలదాచుకుంటున్నరన్నారు. పండుగ ఇళ్లు శుభ్రం చేయడానికి వచ్చి భార్య కుమారి అనారోగ్య పాలైందన్నారు.ఆమెను చూడటానికి వచ్చిన సాల్మన్‌ను పథకం ప్రకారం టీడీపీ గుండాలు దాడికి తెగబడ్డారన్నారు.చంద్రబాబుకు ముస్లిం, క్రిస్టియన్, దళితులంటే ఇష్టం ఉండదని విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగపాలనతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను వేధించడం పనిగా పెట్టుకున్నరన్నారు. అంబేడ్కర్‌పాలనను జగనన్న అందిస్తే దుర్మార్గపు పాలన కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. సీఐ, ఎస్సైల సహకారంతో హత్య జరిగిందని ఆరోపించారు. అంత్యక్రియలకు సాల్మన్ కుటుంబసభ్యులను పంపకుండ పోలీసులు వేధించారన్నారు.వైఎస్సార్‌సీపీ నాయకులను అడుగడుగున అడ్డుకోవడం అన్యాయమన్నారు.వీటి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తారన్నారు.ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.ఇలా హత్యలు చేసుకుంటేపోతే ప్రజలు భయాందోళనతో రాష్ట్రం విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.హత్యకు బాధ్యతగా సీఐ, ఎస్సైలను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని వివరించారు.ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్,నాయకులు రజనీకాంత్, అన్బు,హరిషారెడ్డి,అల్తాఫ్, నౌషద్,నవాజ్,శాంతి,అమీన్, మదన్ తదితరులు పాల్గొన్నారు.