మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 11 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామం నుండి బోరావెల్లి కి వెళ్లే ప్రధాన రోడ్డు రహదారి మార్గంలో ఇరు ప్రక్కల కంప చెట్లు ఏపుగా పెరగడంతో మూల మలుపుల వద్ద ఎదుట మొదట చిన్న పెద్ద స్కూల్ బస్సులు ఆటోలు రెండు చక్రాల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇట్టి సమస్యను గత నెలలో వివిధ న్యూస్ పత్రికలో వార్తలు వచ్చినా మండల గ్రామ ప్రభుత్వ అధికారులు స్పందించకుండ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఉండటంతో.ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సోమవారం ప్రజావానిలో అడిషనల్ కలెక్టర్ కంపచెట్ల సమస్యపైన వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ డిపిఒ ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు మండల గ్రామ అధికారి ఎంపిడిఓ భాస్కర్ , శ్రీధర్ రెడ్డి జేసిబితో పూర్తిగా కంపచెట్ల మొద్దులను తొలగించడతో జల్లాపురం బొరవేల్లి గ్రామస్తులు వాహన దారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొరెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి శాంతకుమార్ నాయిక మహేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *