విశ్వగురు, ప్రైమ్ నేమ్ అవార్డులతో మెరిసిన రాములు యాదవ్…సినీ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా పురస్కారం…
రేణిగుంట మన ద్యాస జనవరి 7.
యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ కి ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. సామాజిక సేవలో ఆయన అందిస్తున్న విశేష కృషికి గాను ‘విశ్వగురు’ మరియు ‘ప్రైమ్ నేమ్ న్యూస్ ఛానల్’ సంయుక్తంగా ప్రకటించిన నేషనల్ కామధేను అవార్డు’*ను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం మరియు బిసివై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా రాములు యాదవ్ ఈ జాతీయ స్థాయి అవార్డును స్వీకరించారు. యాదవ సామాజిక వర్గ అభ్యున్నతికి మరియు వారి హక్కుల సాధన కోసం రాములు యాదవ్ నిరంతరం చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.తిరుపతిలో ఘన స్వాగతం – సన్మానం:-జాతీయ అవార్డు గ్రహీతగా తిరుపతికి విచ్చేసిన రాములు యాదవ్ కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.దేవేందర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు,వెంకటాద్రి యాదవ్ జాతీయ కార్యదర్శి మరియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. రాములు యాదవ్ కృతజ్ఞతలు ఈ సందర్భంగా రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, యాదవ హక్కుల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ గౌరవాన్ని అందించిన నిర్వాహకులకు మరియు అభినందనలు తెలిపిన సహచర నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
