మన ధ్యాస,నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు వేదయపాలెం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 32 మంది కార్యకర్తలకు అవార్డుల ప్రధానం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……..ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమైనది అని అన్నారు.అవార్డులు పొందిన 32 మందే కాదు..ప్రతి కార్యకర్త ఈ విషయంలో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమ కేసులకు ఎదురొడ్డి కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు అని అన్నారు.2025లో కూటమి ప్రభుత్వ పాలన విజయవంతంగా జరిగింది అని తెలిపారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ సహకారంతో అభివృద్ధి, సంక్షేమంలో కొత్త చరిత్ర సృష్టించారు అని అన్నారు.దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని తెలిపారు.జగన్ రెడ్డి ప్రభుత్వం మూసేసిన కీలకశాఖలను తిరిగి గాడిలో పెట్టారు అని అన్నారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి అని అన్నారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం… అని తెలియజేశారు.


