మన ధ్యాస, ,మనబోలు, డిసెంబర్ 31:వైసీపీ హయాంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టారు..ఏ రోజూ పారిపోలేదు..ధైర్యంగా ఎదుర్కొన్నా అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీలో పింఛన్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…… నూతన సంవత్సరం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే పింఛన్లు అందజేస్తున్నాం అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రూ.2700 కోట్లు పింఛన్ రూపంలో పంపిణీ చేస్తున్నాం అని అన్నారు.వైసీపీ హయాంలో పింఛన్ల కోసం నెలకు కేవలం రూ.1650 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అని అన్నారు.కూటమి ప్రభుత్వం పింఛన్ల పథకానికి ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తోంది..ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు లబ్ధిదారులకు అందించింది అని తెలియజేశారు.జగన్ రెడ్డి సర్కారు పింఛన్ కోసం ఖర్చు పెట్టింది ఏడాదికి రూ.19500 కోట్లు మాత్రమే అని తెలిపారు.వైసీపీ సర్కారుతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.13500 కోట్లు అదనంగా ఇచ్చింది అని తెలిపారు .ఐదేళ్లలో ఒక్క పింఛన్ల కోసమే రూ.65 వేల కోట్లను వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం ఎక్కువగా ఖర్చుపెట్టబోతోంది అని అన్నారు.పింఛన్ ను రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచేందుకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది అని అన్నారు.అప్పట్లో అమ్మఒడి పథకం పేరుతో ఒక బిడ్డకే నగదు అందించారు. మా ప్రభుత్వంలో తల్లికివందనం పథకంతో ఎంత మంది బిడ్డలుంటే అందరికీ అందిస్తున్నాం…ఈ పథకానికి ఏటా రూ.10 వేల కోట్లు అందిస్తున్నాం అని అన్నారు.దీపం పథకంతో మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత పంపిణీ జరుగుతోంది అని అన్నారు.స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అని అన్నారు.దివ్యాంగులకు కూడా ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది అని అన్నారు.సంక్షేమం విషయంలో మా కూటమి ప్రభుత్వం కంటే జగన్ రెడ్డి ఎక్కువ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని అన్నారు.వైసీపీ నాయకులతో పాటు దొంగ సాక్షి కూడా చెండాలమైన మాటలు, రాతలకు పరిమితమయ్యారు అని అన్నారు.ఒక్క మనుబోలు మండలంలో ఈ రోజు 5575 మందికి పింఛన్ గా రూ.2.45 కోట్లు ఇస్తున్నాం అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి నెలా రూ.17 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతోంది అని అన్నారు.చరిత్రలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం చంపేసిన కీలకశాఖలను బతికించాం అని అన్నారు.వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ లాంటి కీలకశాఖలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి అని అన్నారు.నేను, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇద్దరం వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేశాం..ఎవరి హయాంలో ఎన్ని రైతు రథాలు ఇచ్చారో చెప్పగలడా అని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రిగా నా హయాంలో 23500 రైతు రథాలను(ట్రాక్టర్లు) సబ్సిడీపై అందించాం అని అన్నారు.బిందు తుంపర్ల సేద్యం రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపాం అని అన్నారు.వ్యవసాయ యాంత్రీకరణలోనూ ఏపీని దేశంలో నెం 1గా నిలబెట్టాం అని అన్నారు.రైతులకు సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందజేశాం అని అన్నారు.నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడటం కాదు..ప్రజల కోసం ఎవరి హయాంలో ఏం జరిగిందో చెప్పాలి అని అన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ దోపిడీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు అని అన్నారు.కండీషన్ బెయిల్ తో బతికే వ్యక్తి కూడా నాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.వైసీపీ హయాంలో నాపై తప్పుడు కేసులు బనాయిస్తే ఎక్కడికీ పారిపోలేదు..మా పార్టీ కార్యాలయంలో కూర్చుని అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరా అని అన్నారు.ఐదేళ్లలో నాపై 18 అక్రమ కేసులు పెట్టించాడు…పారిపోకుండా చట్టప్రకారమే పోరాడాను అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *