మన ద్యాస, కోవూరు, డిసెంబర్ 31 :నూతన సంవత్సరం కోవూరు నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆకాంక్షించారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు మరియు విపిఅర్ అభిమానులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.2026 నూతన సంవత్సరం కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంట సుఖ శాంతులు, సిరి సంపదలు నింపాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి అనే పవిత్ర యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. ​నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వ జన రంజక పాలనలో మరెన్ని సంక్షేమ పథకాలు అమలై ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *