మన ధ్యాస, నెల్లూరు డిసెంబర్ 31: ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న కూటమి ప్రభుత్వం నిజంగా అభినందనీయం అని నెల్లూరు వ్యవసాయ మార్కెట్ ఏఎంసి డైరెక్టర్ మరియు జనసేన పార్టీ నాయకురాలు గునుకుల విజయలక్ష్మి అన్నారు.డిసెంబర్ 31న నెల్లూరు 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో జనసేన పార్టీ వీర మహిళ, ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.నగర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నమున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పేదల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కిప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ విధానం –అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది అని అన్నారు.పలుసమస్యలపై ప్రజలతో మమేకమవుతూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్,జనసేన వీర మహిళ గునుకుల విజయలక్ష్మి,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,డివిజన్ నాయకులు విశ్వనాథ్,వెంకటరమణ,ప్రతాప్ మరియు ఇతర జనసైనికులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *