అధోగతిని అధిగమించి అభివృద్ధి వైపు పయనిస్తూ,ఏడాది చంద్రన్న పాలన, సూపర్ సిక్స్ పథకాలతో, సూపర్ సక్సెస్.నియోజకవర్గ వ్యాప్తంగా 39వేల 665 పెన్షన్లు, ప్రతి నెల పంపిణీ,దాదాపు సుమారు రెండు కోట్ల రూపాయలతో,39 వేల కుటుంబాలకు,లబ్ధి,వ్యవసాయం,పారిశ్రామిక రంగం తోనే ఉదయగిరి అభివృద్ధి
వింజమూరు, డిసెంబర్ 31, మన న్యూస్,(నాగరాజు కె)

గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన పాలనను గాడిలో పెట్టి అదోగతిని అధిగమించి సంక్షేమ అభివృద్ధి వైపు చంద్రన్న పాలన కొనసాగుతుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు.బుధవారం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీ నందు జరుగుతున్న పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు.పెన్షన్ దార్ల ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆయన చేతుల మీదుగా పింఛన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలో 370 మీటర్ల సిసి రోడ్ అవసరముందని గ్రామస్తులు తెలియపరచగా రోడ్డుకు ఆమోదం తెలిపి, అధికారులతో మాట్లాడి రోడ్డును మంజూరు చేయించారు. అదేవిధంగా నీటి సమస్య వివరించగా సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 13 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పర్వేక్షణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్,సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.విశాఖ పట్టణానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మన రాష్ట్ర అదృష్టం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పింఛన్లు పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని అందులో నేను కూడా పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో తొలి అడుగు పడిందని దీని తర్వాత మరిన్ని అడుగులు పడతాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 39,665 పెన్షన్లు పంపిణీ, జరుగుతుందన్నారు. ప్రతి నెల సుమారు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా 39 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్తుందన్నారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఒకటిన్నర సంవత్సరం కాలంలో చంద్రన్న పాలన సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ సక్సెస్ అయిందన్నారు.నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, వేడుక సంతోషాన్ని ఇవ్వాలే గాని, సమస్యలు రాకూడదని,ఆ విధంగా అందరం ముందుకు నడవాలని, భోగి,సంక్రాంతి, కనుమ,పండుగ సుఖసంతోషాలు భోగభాగ్యాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటూ,నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అధికారులకు అనధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు.గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని గ్రామ నాయకులు జనసేన నాయకులు శాలువాలుతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి,ఎంపీపీ ఆనంగి రమణయ్య, క్లస్టర్ ఇంచార్జ్, చేబ్రోలు వసంతరావు,కో క్లస్టర్, పాములపాటి మాల్యాద్రి, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు,ఏగినేని శ్రీనివాసులు నాయుడు,కొండపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, గ్రామ నాయకులు, నాగభూషణం, అంకి పెద్దయ్య, నాగేశ్వరావు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, ఈ ఓ పి ఆర్ డి కొప్పర్తి రామారావు, పంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
