బ్రహ్మసముద్రం,మనధ్యాస: మండలం లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కురుబ గంగమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో మండలంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దిగ్భ్రాంతిగంగమ్మ మృతి వార్త తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి పార్టీకి, మండలానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పరామర్శఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు సోమవారం గంగమ్మ నివాసానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక నిబద్ధత గల నాయకురాలిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ వన్ ఇన్‌ఛార్జ్ వన్నూరుస్వామి, నాగరాజు, వేపులపర్తి వెంకటేష్, భీమప్ప, భీరేష్, పెన్నప్ప, ఏర్రిస్వామి, వన్నాజ్జ, లక్ష్మీపతి, సిద్ధయ్య, డీలర్ పెన్నప్పతో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని గంగమ్మకు నివాళులు అర్పించారు.