జలదంకి, డిసెంబర్ 21,మన న్యూస్,(కె నాగరాజు ).
ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయిపార్టీ నిబంధనలు, కనీస ప్రోటోకాల్‌ను విస్మరించారు దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ అధిష్టానం నియోజకవర్గ మరియు జిల్లా స్థాయిలో కీలక పదవులను కట్టబెట్టినప్పటికీ, సొంత మండలంలోనే ఆయా నాయకులకు కనీస గౌరవం దక్కకపోవడం గమనార్హం. పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కొందరు ముఖ్య నేతల ఫోటోలు గైర్హాజరు కావడం చూస్తుంటే, పార్టీలో సమన్వయం లోపించిందని స్పష్టమవుతోంది.