బంగారుపాళ్యం, మన ధ్యాస,డిసెంబర్ 18
పిట్ట కొంచం కూత గణం అన్నట్లు 4వ తరగతి చదువుతున్న ఇ.వివన్ చిత్తూరు నారాయణ స్కూల్లో చదువుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు.ఇప్పటికే స్టేట్ రోలర్ బాస్కెట్ బాల్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించి, నేషనల్ రోలర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యాడు.ఈ నెల 28వ తారీకు మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటున్నాడు.జాతీయ స్థాయి పోటీలలో విజయం సాధించాలని తల్లిదండ్రులు, కోచ్ బి.కార్తీక్ రెడ్డి మరియు స్కూల్ యాజమాన్యం ఏజీఎం, ప్రిన్సిపల్,పీ.టి మాస్టర్ లు కోరుకుంటున్నారు.