టిడిపి పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం. అందుకు నిదర్శనం మేకపాటి శాంతకుమారి నియామకం
గ్రంథాలయం చైర్మన్ గా నియామకమైన మేకపాటి శాంత కుమార్ కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వింజమూరు, మన ధ్యాస న్యూస్,డిసెంబర్ 12,(నాగరాజు కె).

కూటమి ప్రభుత్వంలో మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి వరించింది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి అయిన ఆమె 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం కోసం పనిచేసినందున, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో ఆమెను జిల్లా గ్రంథాలయం చైర్మన్ గా నియమించారు.పార్టీలో పని చేసిన వారికి వాటంతట అవే పదవులు వస్తాయనే దానికి ఈ నియామకం ఒక నిదర్శనం.ఓపిక, సహనం, ఓర్పు తో పార్టీ విధివిధానాలతో పని చేసే వారిని అధిష్టానం గుర్తిస్తుంది.మేకపాటి శాంత కుమార్ కి పదవి రావడం పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హర్షం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.పార్టీలో ఇంకా అనేకమంది కష్టపడిన వారు ఉన్నారని వారికి కూడా త్వరలోనే మంచి గుర్తింపు వచ్చే పదవులు వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *