కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 08,(కె నాగరాజు).
కలిగిరి మండలం పడమర గుడ్లదోన పంచాయతీలోని ఎస్సీ కాలనీలో నివసించే బుట్టి శ్రీనివాసుల ఇంటిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమవడం తో బట్టలు,గృహోపకరణాలు సహా అన్ని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి.ఈ దుర్ఘటన విషయం స్థానిక నాయకులైన రాధాకృష్ణ ,రమేష్ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి తెలియజేయగా,ఎమ్మెల్యే వెంటనే స్పందించి,అపదలో ఉన్న కుటుంబానికి తక్షణ సహాయంగా,కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ సహాయాన్ని స్థానిక నాయకులు, ద్వారా వెంటనే బాధిత,కుటుంబానికి,అందజేశారు.ఆపదలో ఉన్న వారిని వెంటనే స్పందించి సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి బాధిత కుటుంబం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు








