నిత్య స్ఫూర్తి ప్రదాత డా. బి. ఆర్. అంబేద్కర్

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:
నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి, మానవతా మూర్తి, భరత జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ఎందరికో నిత్య స్ఫూర్తి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ , నెల్లూరు నందు ఎన్సిసి క్యాడెట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ…… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గంలో జన్మించి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో చిన్నతనం నుంచే ఎన్నో అవమానాలను అవహేళనలను ఎన్నో ఆటంకాలను ఎన్నో బాధలను అనుభవించి కసితో స్వయం కృషితో ఉన్నత విద్యనభ్యసించి ప్రపంచ మేధావిగా ఎదిగిన మానవతా మూర్తి, దయార్థ్ర హృదయుడు,సహనశీలి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, త్యాగశీలి అని, తన కుటుంబాన్ని భారతదేశ ప్రజలందరి కోసం త్యాగం చేసిన మహనీయుడని,వారి అడుగుజాడల్లో విద్యార్థులు బాల్యం నుంచే ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని,వారి అడుగుజాడల్లో యువత నడిచినప్పుడే వారికి నిజమైన ఘన నివాళి అని అన్నారు.

  • Related Posts

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌.…

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*