మన ధ్యాస,తిరుపతి, :
మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కర్నాటి శంకర్ రెడ్డి సోదరుడు టిడిపి నేత కందాటి సురేష్ రెడ్డి, టిడిపి మాజీ నగర అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్, ఎం ఆర్ పల్లి టిడిపి నేత ఎన్ రామచంద్రారెడ్డి, గంగులయ్య లు శనివారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సురేష్ రెడ్డి తమ అనుచరులతో ఆలయం వద్దకు చేరుకోగానే చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ సుభిక్షంగా మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.







