గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 జోగుళాంబ గద్వాల లోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,EO సత్యచంద్రరెడ్డి, ఆలయ ధర్మకర్తలు ప్రహ్లాద్ రావు,అరవింద్ రావులు. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ డీకే అరుణ,గద్వాల జిల్లా బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ద రెడ్డి.మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణజలు సుభిక్షంగా ఉండి.. వృద్ధి సాధించాలని కోరుకున్నాను.ఆలయ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం ప్రసాద్ స్కీం కింద ప్రపోజల్ పంపాలని ఎండోమెంట్ అధికారులకు గతంలో సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు పంపమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రపోజల్ పంపాల్సి ఉంది.కేంద్రానికి ప్రపోజల్ అందగానే.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆలయాభివృద్ధికి నిధులు అందేలా తప్పక కృషి చేస్తాను.మరోసారి గద్వాల ప్రజలకు తిమ్మప్ప బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు.ప్రజలు సుఖసంతోషంగా ఉండి.. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బండల పద్మావతి వెంకట రాములు, జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్రరెడ్డి,మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,మాజీ సర్పంచ్ దామ నాగరాజు, బిజెపి సీనియర్ నాయకులు కృష్ణం రాజు ,మల్లెం దొడ్డి వెంకటేశ్వర రెడ్డి,రఘు గౌడ్,దామ వెంకటేష్, రెడ్డప్ప, లక్ష్మీ నారాయణ ,నరసింహులు,వీరన్న గౌడ్, మల్దకల్ మండల నాయకులు తదితరులు.










