పార్టీ బలోపేతం గ్రామాల పురోగతి ఉదయగిరి మండలంలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు.గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం- ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి, మన ధ్యాస,డిసెంబర్ 5. (కె నాగరాజు).

ఉదయగిరి మండల పరిధిలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని గ్రామాల అభివృద్ధి, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా ముందుకు రావాలనే పిలుపును ఇచ్చారు.అభివృద్ధి పథంలో గ్రామాలు దూసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.శుక్రవారం నాడు ఉదయగిరి మండలంలోని కృష్ణంపల్లి, నేలటూరు పంచాయతీలలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు కోసం జరిగిన సమావేశాలకు కాకర్ల సురేష్ హాజరయ్యారు.ఈ కార్యక్రమములో ముందుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నిస్వార్థంగా పనిచేసిన బూత్ ఏజెంట్లు,పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు,అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న నాయకులను ఎమ్మెల్యే స్వయంగా, అభినందించారు.వారి సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తదుపరి గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూసంబంధిత సమస్యలు, గ్రామంలో మౌలిక వసతుల గురించి, సీసీ రోడ్ల అవసరం, తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి విషయాలను గ్రామ ప్రజలు వివరించారు.వాటిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే ఈ సమస్యల పరిష్కారానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. అనంతరం టిడిపి మండల నాయకులు,గ్రామ నాయకుల సమక్షంలో ప్రతి పంచాయతీలో గ్రామ కమిటీలను సక్రమంగా ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న ఈ కార్యక్రమం ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం–ప్రజలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *