మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యంత ఫలితాలతో ఉత్తమ విద్యను అందిస్తున్న విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్ క్యాంపస్ నందు, వివిధ పాఠశాలలలోపదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నామని కళాశాల కరస్పాండెంట్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు.ప్రతి సంవత్సరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మా కళాశాల ద్వారా వారి ప్రతిభను పెంపొందించుకోవడం కోసం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా 80 మార్కులు పేపర్ తో విద్యార్థులు ఎలాంటి రుసుము లేకుండా ఈ పరీక్షకు డిసెంబర్ 14వ తారీఖున హాజరై ఈ పరీక్షను రాసి బహుమతులను గెలుచుకోవలసిందిగా విద్యార్థులకు తల్లిదండ్రులకు చైర్మన్ బి లక్ష్మి తెలిపారు.ఇందులో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతి 5000,రెండో బహుమతి 3000,మూడో బహుమతి2000 చొప్పున గెలుపొందిన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ టీవీవి రమణ తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.







