జలదంకి, నవంబర్ 30,మనద్యాస న్యూస్,(కె నాగరాజు)

దిత్వా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో జలదంకి మండల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని… జలదంకి పోలీస్ శాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉందని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తెలిపారు..మండలంలోని చామదల, కమ్మవారిపాలెం, సోమవరప్పాడు, గోపన్నపాలెం, టంకం వారి పాలెం, గ్రామాల వద్ద ఉన్న సప్తాలపై నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.. వాగులు, వంకలు, కాలువలు ఉన్న పరిసర గ్రామ ప్రజలు చేపల వేటకు, సరదాగా ఈత కొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.. నీటి ప్రవాహం ఉన్న వాగుల సప్తాలపై ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు..తుఫాను దృష్ట్యా అధికారులు సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. మండల పరిధిలో ప్రతి గ్రామంలో చిన్నపిల్లలను, బడి ఈడు పిల్లలను నీటి గుంటల దగ్గరికి వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రతి గ్రామంలో చెరువులు నీటి గుంటలు నిండుగా నీటితో ఉన్నాయి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. దిత్వా తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఎస్సై లతీ ఫున్నిసా కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *