కావలి, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి (కె ఎన్ రాజు )://
*కందుకూరి హాస్పిటల్ అధినేత డాక్టర్ మంచిగంటి రామస్వామి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్బంగా బి ఆర్ ఎమ్ పి డబ్ల్యూ ఏ గ్రామీణ వైద్యులు అధ్యక్షులు ఉప్పుటూరి ఏడుకొండలు, ఉపాధ్యక్షులు దామ మధుసూదన రావు డాక్టర్ రామస్వామి కి పుష్ప గుచ్చం, దుస్సాలువ తో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామీణ వైద్యులకు అండగా ఉంటానని,అదేవిదంగా నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తామని తెలిపారు.గ్రామీణ వైద్యులు భాస్కర్, ఇస్మాయిల్,హరి,భాగ్యరాజ పాల్గొన్నారు*








