జియ్యమ్మ వలస/గరుగుబిల్లి/మనధ్యాస/నవంబర్ 25. తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మార్కొండ పకీరు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, సోమవారం ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. అలాగే తోటపల్లి దేవస్థానం అభివృద్ధి కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ప్రమాణ స్వీకారం: ఆదివారం నాడు దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మార్కొండ పకీరు నాయుడు తో పాటు 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, సోమవారం, ప్రభుత్వ విప్ అందుబాటులో లేదు, నూతన చైర్మన్ మార్కొండ ఫకీరు నాయుడును ప్రత్యేకంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నూతనంగా నియమితులైన కమిటీ, దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. చైర్మన్ పకీరు నాయుడు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *