హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్, జోగుళాంబ గద్వాల.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన,గద్వాల జిల్లా

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 జోగుళాంబ గద్వాల జిల్లా హోమ్ గార్డ్స్ స్థాపన దినం సందర్భంగా: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న హోమ్ గార్డ్స్‌కు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హోమ్ గార్డ్స్ పట్ల ఆత్మీయతను చాటుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఈ క్రింది విధంగా వున్నాయి. హోమ్ గార్డుల దినభత్యం రూ. 921 నుండి రూ. 1000కి పెంపు.వీక్లీ పరేడ్ అలవెన్స్ నెలకు రూ. 100 నుండి రూ. 200కి పెంపు.విధుల నిర్వహణలో సహజమరణం పొందినా లేదా ప్రమాదవశాత్తు మరణం కలిగిన హోమ్ గార్డ్స్ కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయడం. ఇవేకాకుండా, ఆరోగ్యశ్రీ Health Scheme ను హోమ్ గార్డ్స్ కు వర్తింపచేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఇవన్ని కూడ జనవరి నెల 2025 నుండి అమలు లోనికి వస్తాయి. గౌరవ ముఖ్య మంత్రి సహృదయ నిర్ణయాలను పురస్కరించుకొని, జోగుళాంబ గద్వాల జిల్లా హోమ్ గార్డ్స్ కార్యాలయం నందు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇన్చార్జ్ ఆర్ఎస్ఐ విజయ భాస్కర్ , హోంగార్డ్స్ రాజశేఖర్ మరియు పరశురాముడు, కృష్ణ, యుగంధర్, ఈశ్వరమ్మ, సురేఖ, ప్రమీల, కురుమన్న బి.కృష్ణ, శ్రీనివాస్, నిజాముద్దీన్, హుస్సేన్ లు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం