మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్‌ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు ప్రక్రియ,రైతులకు అందుతున్న సేవలు,తూకం రేట్ల విషయాలపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే యార్డులో నిల్వ ఉంచిన సోయాబీన్ పంటను స్వయంగా పరిశీలించారు.ప్రతి నాణ్యమైన సోయా గింజను రైతుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు తగిన న్యాయం జరిగేలా పర్యవేక్షణ కొనసాగించాలనిసూచించారు.రైతు లు అకాల వర్షాల కారణంగా పంటలో కొంతమంది సోయా గింజలు మట్టి తగిలి సైజు తగ్గినట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి,వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే కొనుగోలు కేంద్రంలో సదుపాయాలను మరింత మెరుగుపరచాలని,తూకం యంత్రాలు,వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ఎటువంటి మోసపూరిత చర్యలకు గురికాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ సిసి ఆఫ్ స్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, దువ్వా వినయ్,మహనమ, ఎన్ సి ఆఫ్ ఎల్ సర్వేయర్ మహేష్,మార్క్‌ఫెడ్ డియం శశిధర్ రెడ్డి,మార్క్‌ఫెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ చందు, సంఘ అధ్యక్షులు నాల్చర్ బాలాజీ,కాంగ్రెస్ డెలిగేట్ విఠల్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు దర్పల్ గంగాధర్, సంఘ కార్యదర్శి శ్రావణ్ కుమార్,తదితరులు ఉన్నారు.









