మన ధ్యాస ,కోవూరు, నవంబర్ 12: ముఖ్య మంత్రి చంద్రబాబుకు పని తక్కువ ప్రచారం ఎక్కువ ప్రజల బాగోగులు ఆయనకు పట్టవని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ముందుగా కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా కార్యాలయం వరకు సాగిన ర్యాలీకి ప్రజలు ఉత్సాహంగా హాజరయ్యారు. ర్యాలీకి ప్రారంభానికి ముందు అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. బైక్ ర్యాలీని పార్టీ కోవూరు మండలాధ్యక్షులు అనూప్ రెడ్డి నిర్వహించినారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటేకరణను వ్యతిరేకిస్తూ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోవూరు నిరసనను మాజీ మంత్రి పార్టీ పీఏసీ సభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు.ఈ సందర్భంగా మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…… చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు విశ్వసించి ఆయనకు పట్టం కట్టారు అని అన్నారు. అయితే అధికారాలు వచ్చాక వారికి మేలు చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు పూనుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు .గత సీఎం జగన్ ఎంతో ఉన్నత ఆశయంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారని . వీటిని నిర్వహణకు డబ్బులు లేవంటూ పిఫోర్ అంటూ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.పులివెందులలో సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయిస్తే వాటిని నిరాకరించిన చరిత్రహీనుడు చంద్రబాబు అని ఎదవ చేశారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్యుహ స్పందన లభిస్తుందని చెప్పారు .జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం తధ్యమని పేర్కొన్నారు .ఈ ర్యాలీని చూస్తుంటే ప్రసన్నకు రానున్న ఎన్నికలలో భారీ మెజారిటీ రావడం తద్యమని విషయం తెలుస్తుందని తెలియజేశారు.నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ….. పేదల భవిష్యత్తులతో చంద్రబాబు రాజకీయాల్లో చేస్తున్నారని ప్రసన్న మండిపడ్డారు. నారా వారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంతో ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టుకున్నారని దౌర్యమెత్తారు. విద్యార్థులు డాక్టర్ అవ్వాలని జగన్ సంకల్పాన్ని చంద్రబాబు చెరిపి వేస్తున్నారని ఆరోపించినారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటాన్ని పేదలకు న్యాయం చేయాలి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించొద్దు .వైద్య విద్య హక్కు అందరికీ కావాలంటూ నినాదించారు.అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలోకి వెళ్లి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్ బాబు, వీరి చలపతిరావు, విజయ్ కుమార్ ,నరసింహులు, రాధాకృష్ణా రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, సతీష్ ,కుమార్ రెడ్డి శేషగిరిరావు, నేతలు మల్లికార్జున దినేష్ , మీరాబాయి, అహ్మద్ ,ప్రసాద్ లక్ష్మి కుమారి పాల్గొన్నారు.








