అరగొండ పంచాయతీ లో పారిశుధ్య కార్మికులకు యూనిఫాం మరియు బహుమతులు ప్రధానం

తవణంపల్లి నవంబర్ 12 మన ద్యాస

తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పారిశుధ్య కార్మికుల యూనిఫాం పంపిణీ, వార్డ్ మెంబర్లకు, బహుమతుల ప్రదానం మరియు సమీక్షా సమావేశం కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జి. కరీం ఎం.పి.టి.సి, (మాజీ సర్పంచ్) హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై విలువైన సూచనలు చేశారు.కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ చంద్రశేఖర్ , ఈ.ఓ (పి.ఆర్.డి) రాజశేఖర్ పాల్గొని గ్రామ స్థాయి పరిపాలనలో పారదర్శకత, సేవా దృక్పథం అవసరాన్ని ప్రస్తావించారు.పంచాయతీకి చెందిన అన్ని వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, స్వచ్ఛ భారత్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా జి. కరీం మాట్లాడుతూ మన అరగొండ పంచాయతీ అభివృద్ధి ప్రయాణం కేవలం పనుల పరిమితిలో కాదు, అది ప్రతి వర్గానికీ సంక్షేమం అందేలా ఉండాలి. ముఖ్యంగా ఎస్సి, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, సమాన అవకాశాలు, సదుపాయాలు, గౌరవం అందే దిశగా పంచాయతీ కట్టుబడి ఉంది అన్నారు.టి. ప్రసాంత్ కుమార్ మాట్లాడుతూ యూనిఫాం పంపిణీ, గిఫ్ట్‌లు మాత్రమే కాదు, ఈ కార్యక్రమం ద్వారా సేవా స్ఫూర్తి, ఐక్యత, సమాజ అభివృద్ధికి సంకేతం ఇచ్చాం. మన గ్రామం అభివృద్ధి దిశగా రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడం మన లక్ష్యం అని పేర్కొన్నారు..కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలందరితో భోజన విందు జరిగింది.ఈ కార్యక్రమం లో సర్పంచ్ మల్లు దోరై, వార్డ్ సభ్యులు విఆర్ఓ, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం