
తవణంపల్లి నవంబర్ 12 మన ద్యాస
తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పారిశుధ్య కార్మికుల యూనిఫాం పంపిణీ, వార్డ్ మెంబర్లకు, బహుమతుల ప్రదానం మరియు సమీక్షా సమావేశం కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జి. కరీం ఎం.పి.టి.సి, (మాజీ సర్పంచ్) హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై విలువైన సూచనలు చేశారు.కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ చంద్రశేఖర్ , ఈ.ఓ (పి.ఆర్.డి) రాజశేఖర్ పాల్గొని గ్రామ స్థాయి పరిపాలనలో పారదర్శకత, సేవా దృక్పథం అవసరాన్ని ప్రస్తావించారు.పంచాయతీకి చెందిన అన్ని వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, స్వచ్ఛ భారత్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా జి. కరీం మాట్లాడుతూ మన అరగొండ పంచాయతీ అభివృద్ధి ప్రయాణం కేవలం పనుల పరిమితిలో కాదు, అది ప్రతి వర్గానికీ సంక్షేమం అందేలా ఉండాలి. ముఖ్యంగా ఎస్సి, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, సమాన అవకాశాలు, సదుపాయాలు, గౌరవం అందే దిశగా పంచాయతీ కట్టుబడి ఉంది అన్నారు.టి. ప్రసాంత్ కుమార్ మాట్లాడుతూ యూనిఫాం పంపిణీ, గిఫ్ట్లు మాత్రమే కాదు, ఈ కార్యక్రమం ద్వారా సేవా స్ఫూర్తి, ఐక్యత, సమాజ అభివృద్ధికి సంకేతం ఇచ్చాం. మన గ్రామం అభివృద్ధి దిశగా రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడం మన లక్ష్యం అని పేర్కొన్నారు..కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలందరితో భోజన విందు జరిగింది.ఈ కార్యక్రమం లో సర్పంచ్ మల్లు దోరై, వార్డ్ సభ్యులు విఆర్ఓ, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

