కావలి, నవంబర్ 10 మన ధ్యాస న్యూస్ ://
కావలి మున్సిపాలిటీలో డైలీ వేజ్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కావలి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు… కావలి మున్సిపాలిటీలో 2016 నుండి డైలీ వేజ్ పారిశుద్ధ్య కార్మికులుగా 2025 వరకు కొనసాగుతున్న కార్మికుల నెలవారి వేతనం రూ 10,000 కొనసాగిస్తున్నారు పెరిగిన ధరలకు అనుకూలంగా డైలీ వేజ్ కార్మికులకు నెల్లూరు జిల్లా మినిమం వేజ్ కమిటీ జిల్లా కలెక్టర్ 2025 2026 ధరలకు అనుకూలంగా డైలీ వేజ్ వర్కర్స్ కమిటీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ 597 నిర్ణయించారు కమిటీ ఏదైతే నిర్ణయించిందో ఆ మేరకు డైలీ వేజ్ వర్కర్స్ వేతనం అమలు చేయాలని డైలీ వేజ్ వర్కర్స్ జీతాలు ప్రతినెల సక్రమంగా అందడం లేదని పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్ష కార్యదర్శి ఎండ్లూరి ఆదినారాయణ తన్నీరు వెంకటేష్ సిపిఐ సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు కావలి నియోజకవర్గం సహాయ కార్యదర్శి దమ్ము దుర్గా బాబు తదితరులు పాల్గొన్నారు..








