మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లూర్ తాండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ధరావత్ విఠల్ కి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల కష్టాలు, అవసరాలు గుర్తించి ప్రభుత్వ సహాయం అందించే విషయంలో ఎల్లప్పుడూ ముందుండే మల్లికార్జున్ ప్రజలకు చేరువగా ఉంటూ ప్రతి సమస్యను తనదైన శైలిలో పరిష్కరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.









