

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి తన సొంత గృహంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పురహితులు సంజీవరావు శర్మ, గురు స్వాములు సంగమేశ్వర్ గౌడ్, రమేష్ కుమార్, సాయిలు ఆధ్వర్యంలో ఆరేడు గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారు మోగింది.ఈ కార్యక్రమంలో పిట్లం,మాసానిపల్లి,, అచ్ఛంపేట్,బాచేపల్లి, నిజాంపేట్ గ్రామాలకు చెందిన అయ్యప్ప భక్తుల పాల్గొన్నారు.