మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశనుసారముగా ఖరీఫ్ 2025-26 సీజన్ లో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణపల్లి, నర్వ,మల్లూర్ తాండ,మాగి,సుల్తాన్ నగర్,కోమలాంచ,గాలిపూర్, గిర్నితాండ,మర్పల్లి,ఐకేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ బిక్షపతి కాంటాకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట్,ఆరేడు,గోర్గల్, మంగుళూరు,నర్సింగ్ రావు పల్లి,వెల్గనూర్ గ్రామాలలో సొసైటీ సీఈవో సంగమేశ్వర్ గౌడ్ కాంటాకు కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం 2389 రూపాయలు,కామన్ రకం 2369 ఉంటుందని తెలిపారు.వరి ధాన్యం రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ సాయిలు,తదితరులు ఉన్నారు.
