నెల్లూరు, సెప్టెంబర్ 29 : (మన ధ్యాస న్యూస్:):///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా, ఐఏఎస్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమ్మెల్యే సురేష్ జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల్లో కలెక్టర్ నేతృత్వంలో సమన్వయం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా కూడా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *