జలదంకి సెప్టెంబర్ 29 :(మనధ్యాస న్యూస్):////
🔸బ్రాహ్మణక్రాకలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల……!!!
🔸రైతు ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది తెలుగుదేశమే – ఎమ్మెల్యే కాకర్ల సురేష్…..!!!
జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాక గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతన్నలతో మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం” అనగానే గుర్తొచ్చే పేరు తెలుగుదేశం ప్రభుత్వం అని స్పష్టం చేశారు.రైతు రాబడి పెరిగే దిశగా, రైతు కష్టాలు తగ్గించే దిశగా, రైతు గౌరవం కాపాడే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క అడుగూ వేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం రైతన్నకు అండదండలుగా నిలిచి, ఆయనకు రావలసిన ప్రతి హక్కు, ప్రతి లబ్ధి సమయానికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు.అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, రైతు బిడ్డల భవిష్యత్తు బలపడేలా కృషి జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా రైతన్నలు ఆర్థికంగా బలపడే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలియజేశారు.అలాగే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు రైతు సమాజానికే కాకుండా, ప్రతి గ్రామీణ కుటుంబానికీ దీవెనలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఆ పథకాలతో రైతు మాత్రమే కాదు, పల్లె ప్రజలందరి జీవితాలు సుఖసమృద్ధులతో నిండిపోతాయని శాసనసభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు.రైతు చెమట చుక్క ప్రతి ఒక్కటి ధాన్యపు గింజగా మారుతుంది. ఆ గింజతోనే దేశం జీవిస్తుందని, అలాంటి రైతన్నకు అండగా నిలబడటమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని కాకర్ల సురేష్ కులంకుశంగా తెలియజేశారు.