మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) సెప్టెంబర్ 28,నిజాంసాగర్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఆదివారం, బతుకమ్మ పండుగకు ముందుగా మండల కేంద్రంలో పేరుకుపోయిన సమస్యలను స్వయంగా పరిశీలించిన ఆయన,సమస్యల పరిష్కారంలో ముందడుగు చూపించారు.సద్దుల బతుకమ్మ వేడుకల కోసం మహిళలు బతుకమ్మ ఆడేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి ట్రాక్టర్ సహాయంతో శుభ్రం చేశారు.నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల విడుదల వల్ల కలిగిన ఇబ్బందులు మండల కేంద్రంలోని చిన్నపూల్ వంతెన మరమ్మత్తు పనులను పరిశీలించి వేగవంతం చేశారు,ప్రజలకు రాకపోకల లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు.ప్రజల సమస్యలను ముందుగానే గుర్తించి, పండుగను సౌకర్యవంతంగా, ప్రశాంతంగా జరుపుకునేలా కృషి చేస్తున్న మల్లికార్జున్‌పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *