
మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని బాణాపురం ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించగా, ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దుర్గామాత దర్శించుకున్నారు. మంత్రోచ్ఛరణల మధ్య వేద పండితులు యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించారు.దుర్గామాతకు కుంకుమార్చన కార్యక్రమాన్ని అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి చేపట్టారు.భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు.
ఆలయ ప్రాంగణం జయజయధ్వానాలతో మారుమోగింది.మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక పూజలు చేయగా, పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.యజ్ఞం కారణంగా గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.భక్తుల విశ్వాసం,గ్రామస్తుల ఏకతా స్పూర్తితో జరిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.దుర్గామాత ఆశీర్వాదాలతో గ్రామం శ్రేయోభివృద్ధులు పొందాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంపత్ రెడ్డి,గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
