ఎల్ బి నగర్. మన ధ్యాస ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ ఐ వి ఎఫ్ కార్యాలయం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అడ్వైజారీ బోర్డ్ చైర్మెన్ గంజి రాజమౌళి గుప్త అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోనా శ్రీనివాస్ సేవలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గా ఎంపిక చేయడం జరిగింది అని వారు తెలిపారు.ఐ వి ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు.అను నిత్యం ఆర్య వైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజకీయంగా ఆర్థికంగా ఆర్య వైశ్యులు ఎదిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజరీ ముత్యాల సత్తయ్య , తెలంగాణ రాష్ట్ర ఐ వి ఎఫ్ ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ , ఐ వి ఎఫ్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవి గుప్త ,కోనా భువన్ , వంశీ , కోనా రమేశ్ , అంజి బాబు , ఐ వి ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *