ఉదయగిరి,సెప్టెంబర్ 27 (మనధ్యాస న్యూస్)///

ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని సందర్శించాలని ఆహ్వానించారు. ఇటీవల కాలంలో హైస్కూల్ సంబంధించిన భవనాలను అల్తూరి రామిరెడ్డి జూనియర్ కళాశాలకు అదనపు తరగతులు కింద భవనాలను అప్పగించడం జరిగింది. ఇక్కడ భవనాలను మౌలిక వసతులు లేవని చిన్నపాటి రిపేర్లు చేయించాలని మన్నేటి వెంకటరెడ్డి ని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కోరడం జరిగింది. టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ తన విద్య అభ్యాసం ఇక్కడే పూర్తి చేశారని తెలియజేశారు. అనంతరం జూనియర్ కళాశాలలో పరిశీలించి భవనాలు శిథిలావస్థ లో ఉన్నాయని గుర్తించారు అలాగని మరుగుదొడ్లు సంబంధించి తలుపులను మరియు నీళ్లు సప్లై ను అందుబాటు చేస్తానని తెలియజేశారు. అలానే విద్యార్థులు కూర్చునేకు బెంచీలను తయారు చేస్తాను తన వంతుగా సహాయం చేస్తానని చెప్పారు.తన తోటి చదివిన స్నేహితులతో కలిసి జూనియర్ కళాశాలలో సందర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.అనంతరం జూనియర్ కళాశాల అధ్యాపకులు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి స్నేహితులు అర్షద్, ఎస్దాని , జఫ్రూల్లా, లక్ష్మణరావు, కాజా అహ్మద్ మరియు విజయబాబు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *