మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) సెప్టెంబర్19: మహ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్ రాజేశ్వరీ మాట్లాడుతూ..కిశోర బాలికల తల్లిదండ్రులు, గర్భిణులు,బాలింతలకు పోషకాహారం ఆవ శ్యకతను వివరించారు.కిశోర బాలికల తండ్రులతో పోషకాహారం తయారు చేయించారు. పోషణ మాసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. శిశువులు చిన్నపిల్లలు పౌష్టికారం పై అవగాహనతో పాటు వారు తీసుకునే ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. ఆహారంలో చక్కెర నూనె వినియోగాన్ని తగ్గించే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ మనోహర తదితరులు పాల్గొన్నారు.
