

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన శుభదినం రోజు జరుపుకుంటున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు.ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష,వారి ఆలోచన.ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అని పేర్కొన్నారు.తెలంగాణ అంటే త్యాగం.ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయగౌడ్,ఇమ్రాన్, పరశురాం గంగు నాయక్,అజీమ్, సతీష్ పటేల్,సాయిలు,రాము సేట్ తదితరులు పాల్గొన్నారు.