


మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్) నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టు ద్వారా 9 వరద గేట్లను ఎత్తి దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈలు అక్షయ్,సాకేత్ తెలిపారు.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 59 వేల 865 ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1404.74 అడుగుల 17.426 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు.