మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో గణనాథుని శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. గత 10 రోజులుగా గ్రామంలో గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా,శుక్రవారం నాడు శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గణనాథుని వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదం వేలంపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.8 కిలోల లడ్డూని క్యాస రాజయ్య రూ.11,900కి, 5 కిలోల లడ్డూని బోయిని శ్రీనివాస్ రూ.9,000కి, సేపు గుల దశరథ్ రూ.3,000కి దక్కించుకున్నారు. గ్రామస్తులు ఉత్సాహంగా వేలంపాటల్లో పాల్గొన్నారు.శోభాయాత్రలో గణనాథుని విగ్రహాన్ని ముత్యాల హారాలతో అలంకరించి ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” నినాదాలతో గ్రామం మార్మోగిపోయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిని హరికుమార్ గణనాథుని వద్ద అన్న ప్రసాద దాతగా వ్యవహరించారు.శివాజీ అసోసియేషన్ యూత్.
సభ్యులు,అంజి,రవి,అవినాష్,అరవింద్, ప్రభాకర్,రాకేష్,హరీష్,తో పాటు శోభాయాత్రలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నిఖిల్, ధ్యామగరి నర్సింలు, మేకల భూమయ్య, గుర్ల హరిన్, బోయిని శంకర్, గుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *