వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలి…….. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

* గతం కంటే మిన్నగా రైతులకు మెరుగైన సౌకర్యం కల్పించాలి. *పదవి బాధ్యతలను పొందినవారు పార్టీకి ప్రతిష్ఠతిచ్చేలా చేయండి.*ఘనంగా ఏఎంసి, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం మహోత్సవంమన ధ్యాస,కావలి, ఆగస్టు 30:నూతన కార్యవర్గం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని, గతం కంటే మిన్నగా రైతులకు జరిగిన సేవలు చేయాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. శనివారం మధురపాడు లో ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డులో పిఏ సి యస్, ఏఎంసి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ గా పోతుగంటి అలేఖ్య 13 మంది డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహాయక సంఘం మద్దూరుపాడు చైర్మన్ గా గుంటూరు మల్లికార్జున ఇద్దరు డైరెక్టర్లు తో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే సమక్షంలో చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లు, డైరెక్టర్లను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…… రైతాంగం కోసం గిట్టుబాటు ధర లేనప్పుడు, వారికి ధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు.1964 మార్కెటింగ్ చట్టం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఏఎంసీని ఏర్పాటు చేశారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఆరు నెలల పాటు ఉచితంగా గోడౌన్లను ఇస్తారు అని అన్నారు.ఆరు నెలలు దాటిన తర్వాత 20 పైసల వడ్డీతో ఇంకా కొంతకాలం కూడా గోడౌన్లలో ఉంచుకునే అవకాశం కల్పిస్తారు అని అన్నారు.పంటల రూపేణా కొంత సెస్‌ను వసూలు చేసి, ఆ మొత్తాన్ని రైతాంగం కోసం ఖర్చు చేస్తారు.గోడౌన్స్ నిర్మాణం, పశువులకు టీకాలు వేయించడం, రైతులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏ పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందో సెమినార్ల ద్వారా తెలియజేస్తారు.కావలి ఏఎంసీలో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఒక విభాగం ఉందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు.కావలి నియోజకవర్గంలో భూసార పరీక్షల ద్వారా రైతులకు తగిన సూచనలు ఇవ్వడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందవచ్చని సూచించారు.మద్దూరుపాడు సొసైటీ ద్వారా వచ్చే సెస్‌లో 20 శాతం కావలి ఏఎంసీ ద్వారా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.కావలి మార్కెటింగ్ యార్డ్‌లో ఇప్పటికే రూ. 16 కోట్లు ఉన్నాయి. కొత్త గోడౌన్ల నిర్మాణానికి నివేదికలు ప్రారంభమయ్యాయి అని అన్నారు.అలేఖ్య మున్సిపాలిటీ నడిపిన అనుభవం ఉంది కాబట్టి ఆమెను చంద్రబాబు నాయుడు , లోకేష్ సూచించారు.కొత్త గోడౌన్ల నిర్మాణానికి కావలితో పాటు, బోగోలు, అల్లూరు మండలాల్లో కూడా నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు.అతి తొందరలో ఇక్కడ నీటిని టెస్ట్ చేసే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.మద్దూరుపాడు సహకార సొసైటీ ద్వారా రైతన్నకు ఉపయోగపడే పనులు చేస్తారని, వారికి సేవలు అందిస్తారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు.అలేఖ్య ఆధ్వర్యంలో కావలి మార్కెటింగ్ అభివృద్ధి చెందుతుందని, ఆమె కష్టపడతారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ