


మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
భారీ వర్షాల ప్రభావంతో మద్నూర్, డోంగ్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వరద ప్రభావిత గ్రామాల్లో నష్టపోయిన రైతులను, పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న బాధితులను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ శనివారం ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పంటలు, రహదారులు సహా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా గుర్తించిందని, వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ,అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మండల తహసీల్దార్ ఎం.డి. ముజీబ్‌కు సూచించారు.ఎంపీ వెంట కాంగ్రెస్ పార్టీ సీరియర్ నాయకులు తదితరులున్నారు
