

కావలి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :////
కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దగదర్తి మండలం టిడిపి ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి అన్నారు. రెండు రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నవరం క్వారీలో మాజీ ఎమ్మెల్యే కొంతమందిని రౌడీలను తీసుకువచ్చి తన అనుచరుల తో డ్రోన్ కెమెరా ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచూకీ తెలుసుకొని హత్య చేయించాలనుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. దానికి నిరసనగా దగదర్తి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి ఎల్లిపోడు రోడ్డు వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ హత్య ప్రయత్నం చేసిన ప్రధాన సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు..